కవి కమలారామ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం
న్యూస్ తెలుగు /వినుకొండ : అంతర్జాతీయ గుర్తింపు పొందిన మదర్ తెరిస్సా సర్వీసు సొసైటీ సేవా సంస్థ వారి మూడవ వార్షికోత్సవం పురస్కరించుకొని అత్యంత ప్రతిష్టాకరమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును వినుకొండ కు చెందిన జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు, రచయిత జి. కమలారామ్ కి ఈనెల 15న విజయవాడలోని అక్కినేని కళావేదికలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సినీనటి రజిత, సినీ నటులు పృథ్వీరాజ్ చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ‘మదర్ తెరిసా సేవా సంస్థ’ జాతీయ కార్యదర్శి డాక్టర్ మల్లాది ప్రసాద్ రావు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం అందజేసినందుకు మదర్ తెరిస్సా సేవా సంస్థ వారికి కమలారామ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కవిరత్న కమలారామ్ ను పలువురు మిత్రులు, కవులు, జనవిజ్ఞాన వేదిక నాయకులు, జాషువా సమాఖ్య సభ్యులు అభినందనలు తెలిపారు.(Story:కవి కమలారామ్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం)

