బాల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన ప్రభుత్వ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఏపీ 10వ జూనియర్(అండర్ 19) బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఉమ్మడి గుంటూరు జిల్లా బాలికల జట్టు విజయం సాధించగా జట్టు సభ్యుల్లో 10 మందిలో 7గురు బాలికలు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలానికి చెందినవారు. వారిలో శానంపూడి కి చెందిన ఆకుమల్ల సమీరా, శావల్యాపురానికి చెందిన కామినీడి కావ్య లు స్టార్ ఆఫ్ ఆంధ్ర అవార్డుతో పాటు అక్టోబర్ నెలలో తమిళనాడులో జరిగే జాతీయ పోటీలకు ఏపీ జట్టు నుండి ఎంపికయ్యారు. వీరందరినీ ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అభినందించి విజేతలకు క్యాష్ ప్రైస్ అందజేశారు. కార్యక్రమంలో పిడి రాధాకృష్ణమూర్తి, పిఈటి ఝాన్సీ, బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ జోన నాయక్, జిల్లా సెక్రెటరీ వై. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.(Story : బాల్ బ్యాడ్మింటన్ విజేతలను అభినందించిన ప్రభుత్వ )
