Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పాలైన మహిళా ప్రయాణికులు

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పాలైన మహిళా ప్రయాణికులు

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పాలైన మహిళా ప్రయాణికులు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ ఆర్టిసి డిపోలో బస్సులు ఉన్నప్పటికీ, ఆదివారం కదా కలెక్షన్ ఉండదేమో అనుకున్న డిపో మేనేజర్ నిర్లక్ష్య వైఖరికి ఆదివారం నాడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆదివారం నాడు విజయవాడ ఐదున్నర గంటలకు, ఏడున్నర గంటలకు రెండు బస్సులు ఆపివేశారు. అలాగే దర్శి, ఉల్లగల్లు, భూమాయపాలెం, నరసరావుపేట, పల్లె వెలుగు బొగ్గరం, ముప్పాళ్ళ మొత్తం ఎనిమిది బస్ సర్వీసులు ఆపివేయడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే మహిళలు, ప్రయాణికులు బస్సులు లేక ఆర్టీసీ అధికారులపై ఆగ్రహించారు. ఆదివారం కదా సెలవు వివిధ పనులపై ఆయా ప్రాంతాలు వెళ్లేందుకు మహిళలు పెద్ద ఎత్తున డిపోకు చేరారు. ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి ఒక్క ఆదివారం కూడా బస్సులు ఆపలేదని, ఆదివారం వంకతో బస్ సర్వీసులు ఆపటం ఏంటని ప్రయాణికులు మండిపడ్డారు.. ఈ విషయాన్ని డిపోకు చేరుకున్న విలేకరులు, ఆర్టీసీ డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావును వివరణ కోరగా కొందరు సిబ్బంది సెలవులు పెట్టడంతో బస్ సర్వీసులు ఆపడం జరిగిందని, మధ్యాహ్నం ఒంటిగంట నుండి సర్వీసులు పంపుతున్నామని తెలిపారు.(Story : ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పాలైన మహిళా ప్రయాణికులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!