రోటరీ క్లబ్ సేవలకు మరో అరుదైన గుర్తింపు
న్యూస్ తెలుగు/వినుకొండ : 60 మంది సభ్యుల తో అనేక సేవా కార్యక్రమాల తోను వినుకొండ ప్రాంతంలో ప్రజల మన్నన పొందిన రోటరీ క్లబ్ సేవలకు మరో అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ లో జరిగిన రోటరీ జిల్లా 3150 మెంబర్ షిప్ కాంక్లీవ్ , సుపథం సమావేశం లో జరిగిన అప్రిసిఏషన్ అవార్డులలో ప్లాటినం హోదా సర్టిఫికేట్ సాధించింది. రోటరీ జిల్లా గవర్నర్ ద్వారా ఈ గౌరవాన్ని క్లబ్ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ అందుకున్నారు. ఈ అప్రిసిఏషన్ అవార్డు ద్వారా మెంబర్ షిప్ మరియు డెవలప్మెంట్ కార్యక్రమాల విషయంలో రోటరీ జిల్లాలోని క్లబ్ లలో అత్యంత చైతన్యవంతమయిన క్లబ్ గా నిలిచింది. ఒక మారుమూల ప్రాంతం లోని క్లబ్ ఈ ఘనత సాధించినoదుకు క్లబ్ అధ్యక్షుడు వెంకట నారాయణ ను గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ మురళి క్లబ్ రీజనల్ చైర్మన్ (ఎన్విరాన్మెంట్) ఆలా శ్రీనివాసరావు , క్లబ్ డైరెక్టర్ లు గుత్తా గురునాథం , కూచి రామాంజనేయులు , గట్టుపల్లి యువ ప్రసాద్, క్లబ్ సభ్యులు నాగేందృడు మాష్టారు , కాళ్ల వి. కె. సి విజయ్ కుమార్ , గాలి చిన్న కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.(Story : రోటరీ క్లబ్ సేవలకు మరో అరుదైన గుర్తింపు )
