Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మానవాళికి రాజమార్గం చూపిన దైవ ప్రవక్త మహమ్మద్

మానవాళికి రాజమార్గం చూపిన దైవ ప్రవక్త మహమ్మద్

మానవాళికి రాజమార్గం చూపిన దైవ ప్రవక్త మహమ్మద్

న్యూస్ తెలుగు /వినుకొండ : “దయామయుడు దైవ ప్రవక్త మహమ్మద్” (స) శనివారం స్థానిక లాయర్ స్ట్రీట్ నందు నూరు భాష ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిరతున్ నబి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది ఎస్.కె. సిద్దయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ. మానవాళికి రాజమార్గం చూపి శాంతి ప్రేమను బోధించిన దయామయుడు, దైవ ప్రవక్త మహమ్మద్ (స) అని చెప్పారు. అన్యాయంగా ఏ వ్యక్తి, ఏ వ్యక్తిని హత్య చేసిన అతను సమస్త మానవజాతిని హత్య చేసినట్లేనని ప్రవక్త చెప్పారని అన్నారు. ఇస్లాం చిట్టచివరి దైవ ప్రవక్త మహమ్మద్ మానవాళికి సన్మార్గం చూపి మానవులందరికీ దైవం ఒక్కడేనని మానవులంతా పరస్పరం సోదరులేనని ప్రకటించి విశ్వ మానవ సౌబ్రాత్వత్వాన్ని చాటి చెప్పారన్నారు. ఇతరుల ధన ప్రాణాలకు నష్టాన్ని కలిగించే వాడు నిజమైన దైవ విశ్వాసి కాజాలడని ప్రకటించి ప్రవక్త విశ్వ మానవ ప్రేమను ఎలుగెత్తి చాటారని కొని ఆడారు. ఈ కార్యక్రమంలో నూరు భాషా సంఘం ఉపాధ్యక్షుడు షేక్. మస్తాన్ ,షేక్. సాయి బాబా, సిద్ధారపు. ఫరీద్, సిద్దు, కొత్తపల్లి. ఈశ్వరయ్య, షేక్. బనగానపల్లి. నాగూర్, షేక్. మీరా, పాతకోట. వీరయ్య, కావులూరి. కేశవులు, కాసిం, తదితరులు పాల్గొన్నారు(Story:మానవాళికి రాజమార్గం చూపిన దైవ ప్రవక్త మహమ్మద్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!