రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మైక్ సెట్ పంపిణి
న్యూస్ తెలుగు /వినుకొండ : పాఠశాలల్లో తక్షణం కావలసిన కొన్ని అవసరాల విషయంలో ప్రభుత్వం వరకు పోకుండా స్వచ్చంద సంస్థలు కొన్ని స్పందించి సమకూర్చుతాయని రోటరీక్లబ్ అవసరాల ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు ఏరువ వెంకట నారాయణ అన్నారు. స్థానిక ఎన్. ఎస్. పి కాలనీ జడ్పీ హైస్కూల్ నందు క్లబ్ సభ్యులు గుత్తా గురునాధం, సౌజన్యం తో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు మైక్ సెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ బాజీ , క్లబ్ జిల్లా ముఖ్యులు చిరుమామిల్ల కోటేశ్వరరావు, క్లబ్ డైరెక్టర్ లు జాలాది నాగ ప్రసాద్, మాదాల హనుమంతరావు, కూచి రామాంజనేయులు, నాగేందృడు మాష్టారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.(Story:రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మైక్ సెట్ పంపిణి)

