ఎయిడ్స్..డ్రగ్స్ పై విద్యార్థులకు
అవగాహన కార్యక్రమం
న్యూస్తెలుగు/ఒంగోలు: మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రెవెన్షన్ కంట్రోలు యూనిట్ సహకారంతో మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో సింగరాయకొండ జోషెప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు శ్రీవిద్యనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో హెచ్ ఐ వి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ బాబు మాట్లాడుతూ హెచ్ ఐ, ఎయిడ్స్ ,మరియు యువత మత్తు పదార్దాల వినియోగం వలన యువత భవిష్యత్తు మీద ప్రభావం ఉంటుందని వాటికి యువత దూరంగా ఉండాలని 2017ఎయిడ్స్ చట్టం గురించి హెల్ఫ్ లైన్ నెంబర్ 1097 ఉపయోగించి హెచ్ ఐ వి గురించినా సమాచారం తెలుసుకోవచ్చునని , హెచ్. ఐ వి. నాలుగు విధాలుగా వస్తుంది అని, సురక్షితం కానీ లైంగిక సంబంధాలు, సురక్షితం కానీ సూదులు సిరంజులు, పరీక్షించ బడనీ రక్తం , హెచ్ ఐ వి ఉన్న తల్లి నుంచి బిడ్డకు వస్తుందని చెప్పారు, హెచ్ ఐ వి అంటూ వ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని, ప్రతి ఒక్కరు దీని పై అవగాహన కలిగి ఉండాలి , ఏ ఆర్ టి మందులు వాడటం వల్ల తమ జీవిత కాలాని పెంచుకోవచ్చని చెప్పారూ ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ పి.రమేష్ బాబు ఓ ఆర్ డబ్ల్యు నాగమణి మరియు, హెడ్మాస్టర్. జయ జోసెఫ్ ,సైకం వెంకటేశ్వరరావు సిబ్బంది విద్యార్ధి, విద్యార్దులు , పాల్గొనడం జరిగింది.(Story:మత్తు పదార్దాల వినియోగం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం)

