లోక్ అదాలత్ ద్వారనే సత్వర న్యాయం జరుగుతుంది
న్యూస్ తెలుగు/వనపర్తి : వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయి…ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయని జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్-13వ తేది వరకు వనపర్తి జిల్లా కోర్టులలో “జాతీయ మెగా లోక్ అదాలత్” సందర్భంగా కక్షిదారులకు పోలీసులు అందుబాటులో ఉంటారని జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, చిన్న చిన్న దొంగతనాల కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు టౌన్ న్యూసెన్స్ కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, న్యాయస్థానం ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.(Story :లోక్ అదాలత్ ద్వారనే సత్వర న్యాయం జరుగుతుంది )

