Homeవార్తలుతెలంగాణమాల్స్ మరియూ మార్వాడిలు మాకోద్దు

మాల్స్ మరియూ మార్వాడిలు మాకోద్దు

మాల్స్ మరియూ మార్వాడిలు మాకోద్దు

న్యూస్ తెలుగు/వనపర్తి : భారతదేశంలో స్వదేశీ వస్తువులు కొనాలని పిలుపునిచ్చిన కొన్ని సంస్థలను అనుసరించి, మనము కూడా మాల్స్ మరియూ మార్వాడి లతో ఏ వస్తువు కొనకుండా, సొంత ఊరి షాపులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మరియు చిరు వ్యాపారులను రక్షించాలని ప్రజలందరీ భాగస్వామ్యంతో మేము కూడా కంకణం కట్టుకుని ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు DR సతీష్ యాదవ్ తన స్వగృహంలో పత్రికా ముఖంగా పిలుపునిచ్చారు.సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఈనెల 14న ఆదివారం ధర్మ సమాజ్ పార్టీ అధినేత విషాదరన్ మహారాజ్ వనపర్తి వస్తున్నందున ఆయనకు ఆహ్వానం పలుకుతూ దాచలక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జరిగే సమావేశంలో ఆయన సమక్షంలో ఉద్యమాన్ని ప్రకటిస్తామని, మరియు హైదరాబాదులో ఉండే మేధావులు ప్రజా ఉద్యమకారులు DR పృథ్విరాజ్ యాదవ్, విఠల్ గారినీ వనపర్తికి ఆహ్వానించి.. అతి చిన్న జిల్లా అయిన వనపర్తి లో పెద్ద పెద్ద మాల్ లు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని, అవి ఉండకూడదని, అలాగే మార్వాడి షాపులలో నాసిరకమైన వస్తువుల అమ్మకాన్ని నిరసిస్తూ, వనపర్తి జిల్లాలో చిరు వ్యాపారులను రక్షించాలని, వారికోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించామని, వనపర్తి ప్రజలు,అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు , కార్మికులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామని అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు డా” సతీష్ యాదవ్ తో పాటు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, B.R.S నాయకులు బొడ్డుపల్లి సతీష్, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, నాగరాజు, రమేష్, జింగిడిపురం రవి , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.(Story :మాల్స్ మరియూ మార్వాడిలు మాకోద్దు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments