Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాజన్నదొర ని కలిసిన మక్కువ మండల జడ్పిటీసి

రాజన్నదొర ని కలిసిన మక్కువ మండల జడ్పిటీసి

రాజన్నదొర ని కలిసిన మక్కువ మండల జడ్పిటీసి

న్యూస్ తెలుగు/సాలూరు సెప్టెంబర్ 9 : వైసీపి రాష్ట్ర కార్యదర్శిగా మక్కువ మండల జడ్పిటీసి మావుడి.శ్రీనివాస్ నాయుడు బుధవారం మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి మావుడి.శ్రీనివాస్ నాయుడు వైయస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ నాయకులను రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా*సాలూరు నియోజకవర్గం, మక్కువ మండల జడ్పిటీసీ మావుడి.శ్రీనివాస్ నాయుడు గని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి పార్వతీపురం,కురుపాం నియోజకవర్గాలకు కేటాయించారు ఈ సందర్భంగా వైసీపి రాష్ట్ర కార్యదర్శి మావుడి.శ్రీనివాస్ నాయుడు ఈరోజు సాలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.వైసీపీ అధిష్టానం నన్ను గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా నాకు ఈ పదవి ఇచ్చిన మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అని,అలాగే ఏపీ శాసనమండలి విపక్ష నేత,విశాఖ ఎమ్మెల్సీ బొత్స.సత్యనారాయణ కి,ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ మజ్జి.శ్రీనివాస్ రావు(చిన్న శ్రీను) కి కూడా ధన్యవాదాలు అని,పార్టీ పటిష్టతకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని,మరింత రెట్టింపు ఉత్సాహంతో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సారధ్యంలో 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అగుటకు ఇప్పటి నుంచే కృషి చేస్తానని రాష్ట్ర కార్యదర్శి మావుడి.శ్రీనివాస్ నాయుడు తెలిపారు.మావుడి శ్రీనివాస్ నాయుడు ని వైసిపి అధిష్టానం రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మక్కువ మండల వైసీపీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముక్కు మండలం వైసీపీ శ్రేణులు, అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు.(Story :రాజన్నదొర ని కలిసిన మక్కువ మండల జడ్పిటీసి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!