కాంప్లెక్స్ ఎరువులకు ప్రాధాన్యతనివ్వాలి
న్యూస్ తెలుగు /సాలూరు సెప్టెంబర్ 9 : రైతులు యూరియాను తక్కువ మోతాదులో వేసుకుని కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ వాడాలని సాలూరు స్పెషలాఫీసర్ డివిజనల్ డిసిసి ఆఫీసర్ కే రామారావు అన్నారు బుధవారం సాలూరు మండలంలో గల జీగిరాం మరియు తుండ రైతు సేవా కేంద్రం పరిధిలోసాలూరు స్పెషల్ ఆఫీసర్, డివిజనల్ ఆఫీసర్ జిసిసి కె రామారావు .ఎంపీడీఓ పార్వతి , తహసీల్దార్ నీలకంఠ రావు మరియు ఏవో కే శిరీష యూరియా సరఫరా పర్యవేక్షించారు, ఈ సందర్భంగా జిగిరాం లో 139 బ్యాగులు తుండలో ( కొదమ,పట్టుచీనరు మరియు పగులుచున్నారు )120 బ్యాగులు ఇవాళ రైతులకు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. యూరియా అవుట్ రీచ్ ప్రోగ్రాం లో భాగంగా అధిక యూరియా వాడటం వల్ల నష్టాలు వివరించడం జరిగిందని తెలిపారు.నానో యూరియా తో కలుగు ప్రయోజనాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.(Story :కాంప్లెక్స్ ఎరువులకు ప్రాధాన్యతనివ్వాలి )

