పెబ్బేరు పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు శుక్రవారం పెబ్బేరు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ప్రతాపరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రుచులు హోటల్ ను ప్రారంభించారు. ఆధునిక దిన అందిపుచ్చుకొని ప్రజల నాడిని బట్టి ఆహార పదార్థాలు తయారు చేస్తే త్వరితగతిన అభివృద్ధి చెందవచ్చు అని ఆయన యజమాని ప్రతాపరెడ్డికి సూచించారు. అనంతరం పెబ్బేరు పట్టణంలోని జామ్యా మసీద్ లో నిర్వహించిన మిలాద్ – ఉన్ – నభి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నిర్వహించే మిలాద్ – ఉన్ – నభి వేడుకను ముస్లిం సోదరులు ఎంత పవిత్రంగా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు అనంతరం కంచిరావుపల్లి మాజీ ఉపసర్పంచ్ భాస్కర్ ఏర్పాటు చేసుకున్న పాల కేంద్రాన్ని శాసనసభ్యులు సందర్శించారు.ఈ సందర్భంగా పాలకేంద్రం ఏర్పాటుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ప్రవర్తిస్తూనే ఇలాంటి స్వయం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.(Story : పెబ్బేరు పట్టణంలో పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే )

