జనసేన ఆధ్వర్యంలో సర్వేపల్లి జయంతి
న్యూస్ తెలుగు/విజయనగరం : జనసేన నేత గురాన అయ్యలు కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని శుక్రవారం నిర్వహించారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూఅజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణ అలవర్చి జీవితాన్ని నడిపించే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, రాష్టప్రతిగా దేశానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని కొనియాడారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రాష్టప్రతిగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. అటువంటి మహనీయుని జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఉపాధ్యాయులకు గర్వకారణమన్నారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో త్యాడ రామకృష్ణ, కొర్నాన రామకృష్ణ, పిడుగు సతీష్, ఎంటి రాజేష్, మేడేపల్లి పవన్, సోమదుల సాయి, రౌతు కుమార్,సుంకరి వంశీ, జగదీశ్, వెంకటేష్, సురేష్, ఆనంద్,హిమంత్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : జనసేన ఆధ్వర్యంలో సర్వేపల్లి జయంతి )

