Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు మంజూరు చేయాలి

స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు మంజూరు చేయాలి

స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు మంజూరు చేయాలి

ఏఐటీయూసీ డిమాండ్

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ శివయ్య భవన్, సిపిఐ పార్టీ ఆఫీసులో స్వచ్ఛభారత్ గ్రీన్ అంబాసిడర్స్ ముఖ్య నాయకుల సమావేశం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం సిపిఐ ఆఫీస్ లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా కొప్పవరపు మల్లికార్జున అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంలో స్వచ్ఛభారత్ గ్రీన్ అంబాసిడర్స్ కష్టపడి పనిచేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారని, వీరి మీద విపరీతమైనటువంటి పని భారాన్ని అధికారులు మోపుతున్నారు గాని వీరికి జీతాలు ఇవ్వటం లో సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో కార్మికులకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు వరకు జీతాలు ఇవ్వకుండా వారి చేత వెట్టి సేకరి చేయిస్తున్నారని, జీతాలు అడిగితే మీరు మానుకోండి బడ్జెట్ వచ్చినాక మేమే పిలుస్తామని ఆ వంకతో వీరిని తీసేసి కొత్తవారిని పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, వీటికి భయపడి కార్మికులు నోరెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితులు గ్రామాల్లో ఏర్పడ్డాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసి గ్రామాల్లో అభివృద్ధికి ముందుండాలని లక్ష్యంతో నిధులు మంజూరు చేస్తున్నారని, వాటిలో నుంచైనా స్వచ్ఛభారత కార్మికులు జీతాలు విడుదల చేయాలని, ఇన్ని నెలలు పెండింగ్ ఉండటంతో అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వక కిరాణా షాపుల్లో అప్పులు పుట్టగా పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక పిల్లల్ని బడులు మానిపించి కూలి పనులకు పంపించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 15వ ఆర్థిక సంఘం నిధులు స్వచ్ఛభారత్ ఈ నంబర్ సీటర్స్ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఊట్ల రామారావు, దారి వేముల మరియబాబు, రాయబారం వందనం, తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.(Story:స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు మంజూరు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!