లంబోదరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా భక్తుల ఆహ్వానం మేరకు నాగవరంలోని మొదట పూర్వపు వినాయకుని దర్శించుకుని పలు వినాయక మండపాలని సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి యువత, ప్రజలు వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మాజీ మంత్రి కోరారు. విజయ గణపతి విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించాలని తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట నాగవరం బిఆర్ఎస్ ముఖ్య నాయకులు యువత,పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story:లంబోదరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి)

