Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పల్నాడు జిల్లా కు జాషువా పల్నాడు జిల్లా గా నామకరణ చేయాలి

పల్నాడు జిల్లా కు జాషువా పల్నాడు జిల్లా గా నామకరణ చేయాలి

పల్నాడు జిల్లా కు జాషువా పల్నాడు జిల్లా గా నామకరణ చేయాలి

న్యూస్ తెలుగు / వినుకొండ : జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాకు జాషువా పల్నాడు జిల్లాగా నామకరణ చేయాలని వినుకొండ అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు సమావేశం బుధవారం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీస్ ఆవరణలో జరిగింది. సభాధ్యక్షులుగా వినుకొండ సీనియర్ న్యాయవాది పిజె. లూకా అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘ నాయకులు పల్నాడు జిల్లాకు జాషువా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనిని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల పేర్లు మార్పులు చేర్పులు కమిటీ వారు తప్పక పరిశీలించాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ తీర్మాన అర్జీని పంపించేందుకు కార్చరణకు అఖిలపక్ష కమిటీని చిలకల జాన్ సుందర్ రావు, కన్వీనర్ గా మరియు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి కో కన్వీనర్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు పిజే. లూకా మాట్లాడుతూ. జాషువా పేరు జాషువా జన్మస్థలమైన మన జిల్లాకు పెట్టడం అన్ని వర్గాల వారు అభినందించే చర్యగా వారు అభివర్ణించారు. కన్వీనర్ జాన్ సుందర్ రావు మాట్లాడుతూ. ప్రభుత్వం ఈ విన్నపాన్ని మన్నించి పల్నాడు జిల్లాకు జాషువా పల్నాడు జిల్లాగా నామకరణ చేసేవరకు వివిధ కార్యాచరణ రూపంలో ఉద్యమ కార్యచరణను తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, సిపిఐ, సిపిఎం, (సిపిఐ ఎంఎల్) ఆమ్ ఆద్మీ పార్టీ,, కాంగ్రెస్, మరియు ప్రజా సంఘాలు వారు బూదాల శ్రీనివాసరావు, పిన్నబోయిన శ్రీనివాస్, కే..మల్లికార్జున, బొంకూరు వెంకటేశ్వర్లు, పీవీ సురేష్, దాసయ్య, బి. ఎలియేజర్, దాసరి కోటేశ్వరరావు, పులిమేల రూబెన్, కాసిం పీరా, తోట ఆంజనేయులు, పచ్చి గొర్ల సుధాకర్, భాగవతల రవికుమార్, రెడ్డి బోయిన ప్రసన్న, పౌలేష్, గుమ్మడి వెంకటేశ్వరరావు, బివి నాగేశ్వరరావు ,టీచర్ అమృతపూడి రేవతి, మాచర్ల బుజ్జి, పిడుగు విజయ్, సిహెచ్ శ్యామ్ లింకన్, కుంపట మహేష్, అమృతపూడి రాజేంద్ర ప్రసాద్, కలుపు కోరి ఏసురత్నం, ఎమ్మార్పీఎస్ తదితరులు పాల్గొన్నారు.(Story:పల్నాడు జిల్లా కు జాషువా పల్నాడు జిల్లా గా నామకరణ చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!