పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం తగ్గింపు నోటిఫికేషన్ రద్దు చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కేంద్రం పత్తి దిగుపతి సుంకాన్ని 11% తగ్గిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని కిసాన్ సంయుక్త మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ తగ్గింపుకి వ్యతిరేకంగా రేపు సెప్టెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగామండల కేంద్రాల్లో చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాము. వనపర్తి సిపిఐ ఆఫీసులో మాట్లాడుతూ.. ఇప్పటికే మద్దతు ధర కంటే తక్కువ ధరకు దేశ రైతులు అమ్ముతున్నారని, దిగుమతి సుంకం తగ్గిస్తే మరింత ధర తగ్గి పత్తి దేశ రైతుల ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతామని పీఎం చెప్పిన మాట బూటకము వెంటనే నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని గ్రామపంచాయతీలో తీర్మానాలు చేసి కార్యదర్శి ఇవ్వాలి. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న మండల కేంద్రాలలో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలి. పత్తి రైతుల గ్రామసభలు నిర్వహించి దిగుమతి సుంకం నోటిఫికేషన్ను రద్దు చేయాలని తీర్మానాలు చేయాలి. వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆఫీస్ విలేకరుల సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ అమెరికా పత్తిని మన దేశంలో అమ్ముకోవడానికి మన దేశ దిగుమతి సుంకం 11% తగ్గించడం వల్ల దేశ పత్తి రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అలాగే దిగుమతి సుంకం తగ్గించడం వల్ల చేపలు పాలు కోళ్ల రైతుల పై తీవ్ర ప్రభావం పడి నష్టపోయే ప్రమాదం ఉన్నది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పత్తి సాగుదారులకు మరణ శాసనంగా తెచ్చిన పత్తి దిగుమతి సుంకాన్ని తొలగించాలనే నోటిఫికేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దిగుమతి సుంకం తొలగింపు దేశీయ పత్తి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందనీ రైతులు పండించిన పత్తి ధర ఖచ్చితంగా తగ్గుతుందని, రైతులు మరింత బాధ, అప్పులకు గురవుతారని, ప్రధానమంత్రి మోడీ మాటలు మోసపూరితమని ఆరోపించారు. మన దేశ రైతులకు ఇచ్చే అత్యధిక ప్రాధాన్యత ఇదేనా అని ప్రశ్నించారు. గత 11 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం పత్తి రైతులకు సి2+50% స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ధరను ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. 2025 సంవత్సరంలో వ్యవసాయ వ్యయ కమిషన్ ఖరీఫ్ పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం పత్తి ధర క్వింటాకు పదివేల 75 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.7,710 మాత్రమే ప్రకటించి క్వింటాకు రూ.2365 నష్టం కలిగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, కురుమన్న, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా నాయకులు చింతకుంట మురళి, ఏఐఎస్ఎఫ్ వనపర్తి డివిజన్ సెక్రెటరీ వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story:పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం తగ్గింపు నోటిఫికేషన్ రద్దు చేయాలి)

