ఏఐఎస్ఏ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా శివాంజి, వాగ్యనాయక్
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం వినుకొండ లోని గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో విద్య వ్యవస్థను సంపూర్ణంగా నిర్వీర్యం చేస్తు నేను మేను మేషాలు లెక్కిస్తుందని ఇంటర్మీడియట్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం చూస్తూ ఉన్న కనీసం ఎంతవరకు పూర్తిస్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం, అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తానన్న కూటమి ప్రభుత్వం నేటికీ ఈ జీవో గురించి మాట్లాడకపోవడం రాష్ట్రంలో పీజీ చదువుకున్న విద్యార్థులకు శాపంగా మారిందని, అదేవిధంగా దేశవ్యాప్తంగా బిజెపి తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారిందని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులు మౌలిక వసతులు సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా రోజు రోజుకి విద్యావ్యవస్థలే చిన్న బిన్నం చేస్తుందని తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీజీ విద్యార్థులకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలని ఆశ విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సమస్యలను తక్షణ పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం పల్నాడు అధ్యక్ష కార్యదర్శులు శివాంజి , వాగ్య నాయక్ ఉపాధ్యక్షులు సుబ్బారావు సహాయ కార్యదర్శి సుందర్ కమిటీ సభ్యులుగా పృధ్వి నారాయణ, అశోక్ వర్ధన్, దుర్గాప్రసాద్, బంగారం, ఆమోస్ నవీన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.(Story :ఏఐఎస్ఏ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా శివాంజి, వాగ్యనాయక్)
