Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సురవరం

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సురవరం

0

ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సురవరం

న్యూస్‌తెలుగు/వనపర్తి : సి.పి. ఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ వారి స్వగ్రామము కంచుపాడు గ్రామములో జరిగింది.ఇట్టి సమావేశములో ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఎన్నో ప్రజా విజయాలు సాధించారని జాతీయ స్థాయిలో ఎదిగి మన జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి రాష్ట సాధనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాల ద్వారా రాజ్యస్థాపన జరగాలని ఆయన కలలు కన్నారని ఈ దేశములో కమ్యూనిస్టు పార్టీల మనుగడ ఉన్నంతవరకు సురవరం సుధాకర్ రెడ్డి చిరస్మరణీయుడుగా ఉంటారని ఆయన అన్నారు. (Story:ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సురవరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version