Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు కైవసం

స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు కైవసం

0

స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు కైవసం

న్యూస్ తెలుగు /వినుకొండ : గుడ్ షెఫర్డ్ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేసి పల్నాడు జిల్లా లో చాలా పాఠశాలలు ఉన్నప్పటికీ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు మన పాఠశాలకు రావడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు రావడానికి కారణమైన పిఈటి అజీమ్, వెంకట్ లను ప్రత్యేకంగా అభినందించారు. మన పాఠశాలలో చదువుతో పాటు క్రీడలను కూడా సమానంగా గౌరవిస్తూ ఆడిస్తున్నామని తెలిపారు. క్రీడలలో విద్యార్థులు రాణించినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతం ఉద్యోగాలు క్రీడాకారులకు కేటాయించారని తెలిపారు. సాప్ట్ బాల్ గేమ్ లో జాతీయ క్రీడల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిన అమీర్ సాయి ని సన్మానించామని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి సునీత 595 మార్కులతో పట్టణం మొదటి స్థానంలో నిలిచామని, అలాగే క్రీడల్లో జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ కరస్పాండెంట్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లు మంజుల రెడ్డి , మదన్ రెడ్డి , కిరణ్ రెడ్డి , ప్రమీల, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.(Story:స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు కైవసం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version