పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలి
అందరిని ఒకే చోటుకు చేరిస్తే సహించను
మున్సిపల్ అధికారులను హెచ్చరించిన చీప్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సిద్ధార్థ నగర్ ప్రాంతంలో పర్యటించారు. అయితే వృద్ధులు, వికలాంగులు తదితర లబ్ధిదారులు ఒకే ప్రాంతంలో గుంపుగా ఉండటం, అక్కడే ఖరీదైన భవనాలను చూసి ఎమ్మెల్యే జీవి మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. వీరంతా ఎక్కడ వారు అని అడగటంతో ఆ పక్క వీధి, ఈ పక్క వీధి అంటూ జీవీ కి చెప్పడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే జీవి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పై ఆగ్రహించారు. వికలాంగులను. వృద్ధులను ఇంత దూరం రప్పించడం ఏంటి, మనం వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి కదా, ఇలా మరోసారి జరిగితే సహించేది లేదని జీవి హెచ్చరించారు. అనంతరం వారి వారి గృహాలకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. దీంతో పెన్షన్లు పొందిన వారంతా హర్షం వ్యక్తం చేశారు.(Story:పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలి)

