అందరి చూపు ఏ.పి వైపే
బస్ షెల్టర్ ను ప్రారంభించిన శివశక్తి ఫౌండేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల హరీష్ దంపతులు
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గంలో విద్యార్థులకు ఉపాధి కల్పించే విధంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్, పురపాలక సంఘం సంయుక్తంగా అరుణ హాల్ సెంటర్లో నిర్మించిన గురువారం శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి, శివశక్తి ఫౌండేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల హరీష్, సత్య కృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలో నలువైపులా శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు బస్సు షెల్టర్ లను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పి ఫోర్. కింద తాము 100 కుటుంబాలను దత్తత తీసుకున్నామని, వారికి విద్య, వైద్యం, గృహవసతి అన్ని వసతులు కల్పిస్తామని, వారు ఆర్థిక ప్రగతి సాధించేవరకు తాము ఆదుకుంటామని జీవి అన్నారు. అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని అమలవుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికి అమలు చేస్తున్న పథకాలన్నింటిపై ప్రజల నుండి మహా స్పందన వస్తున్నాదన్నారు. అలాగే ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పన కోసం కృషి చేస్తున్నది అన్నారు. అలాగే ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైపు ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయన్నారు. కాగా ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రమంతా అప్పుల కుప్పగా తయారై, భయంకరమైన ఆర్థిక దోపిడీ జరిగిందన్నారు. ఆనాడు జగన్ మద్యం నిషేధం అమలు చేస్తానని చెప్పి, విచ్చలవిడిగా కల్తీ మద్యం సరఫరా చేసి 32 వేల ప్రాణాలను బలి కొనడంతో పాటు వేలాదిమంది ప్రజలను ఆసుపత్రి పాలు చేశారన్నారు. ఇది చాలదన్నట్లుగా మద్యంపై 15 ఏళ్లకు సరిపడా అప్పులు తెచ్చారన్నారు. ఇక ఐదేళ్ల బొల్లా బ్రహ్మనాయుడు పాలనలో ప్రజల సౌకర్యార్థం పట్టణంలో ఒక్క బస్సు షెల్టర్ నిర్మించలేదని పలు ఘాటు విమర్శలు చేశారు. గోనుగుంట్ల హరీష్ మాట్లాడుతూ. 1998లో వినుకొండలో స్థాపించిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారాగత 28 ఏళ్లుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ, అగ్ని బాధితులను ఆదుకుంటూ ఫౌండేషన్ ప్రజాసేవలో నిమగ్న మై ఉందన్నారు… ఫౌండేషన్ మరింత విస్తృత పరుస్తూ నిరుద్యోగులు, విద్యార్థుల కోసం పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. జిడిసిసి బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. శివశక్తి ఫౌండేషన్ గత 28 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. అలాగే జీవి ఆంజనేయులు నేతృత్వంలో ఆనాడు కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు ఎన్నో సేవలందించారన్నారు. ఇక ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నేనే ప్రారంభించాను అని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాటలు ఎవరు నమ్మరని, ఆనాడు జివి ఆంజనేయులు ఘాట్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించి అందరం కలిసి 65 లక్షల నిధులు కూడా సేకరించడం జరిగి రెండు కిలోమీటర్లు రోడ్డు కూడా వేయడం జరిగిందన్నారు. ఇక త్రాగునీటి పథకానికి ఆనాడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ద్వారా జీవీ 160 కోట్లు నిధులు కూడా తేవడం జరిగిందని, బొల్లా హయాంలో త్రాగునీటి పథకానికి ఒక్క పని కూడా చేపట్టలేదు అన్నారు. తూతూ మంత్రంగా సింగర్ చెరువు బాగు చేయించి నీటి సమస్య తానే తీర్చాలని గొప్పలు చెప్పుకుంటున్నాడని మక్కెన ఎద్దేవా చేశారు. అలాగే బ్రహ్మనాయుడు పెట్టిన జనని ఫౌండేషన్ ఏమైందని మక్కెన ప్రశ్నించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని బొల్లాకు, మక్కెన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు లగడపాటి వెంకట్రావు, ఎన్. శ్రీనివాసరావు, యార్లగడ్డ లెనిన్ కుమార్, పి.వి. సురేష్ బాబు, కే నాగ శ్రీను, మేడం రమేష్, బొంకూరి రోశయ్య, పి.దాసయ్య, మునిసిపల్ కమిషనర్ ఎం.సుభాష్ చంద్రబోస్, మునిసిపల్ సిబ్బంది, శివశక్తి సిబ్బంది పాల్గొన్నారు.(Story:అందరి చూపు ఏ.పి వైపే)

