గీతమ్స్ బ్లూమ్స్ లో చవితి వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక కారంపూడి రోడ్డులోని కాలువ కట్ట వద్ద ఉన్న గీతమ్స్ బ్లూమ్స్ క్యాంపస్ నందు వినాయక చవితి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరై విద్యార్థినీ, విద్యార్థులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ. వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ, పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారన్నారు. చివరి రోజు ఊరేగింపులు, విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు , విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. (Story:గీతమ్స్ బ్లూమ్స్ లో చవితి వేడుకలు)

