ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు
న్యూస్ తెలుగు/వనపర్తి : రానున్న 3 సంవత్సరాల్లో వనపర్తి నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమేలక్ష్యమని , వనపర్తి నియోజకవర్గంను సంబంధిత గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే దత్తత నియోజకవర్గం గా తీసుకోవడం జరిగిందని ఇళ్ల మంజూరుకు ఇబ్బందులు ఏమి ఉండవని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రూ.1కోటి 90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వే సైడ్ మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. ఈ మార్కెట్ నిర్మాణంతో ఖిల్లా ఘణపురం మండల చిరు వ్యాపారులందరికి మార్కెట్ ఇబ్బందులు తొలిగాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లో వ్యాపారాస్తులకు డిప్పు పద్ధతి ద్వారా వారి వారి స్థలాలను కేటాయిస్తారని అప్పటివరకు అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం మండల పరిధిలోని 30 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 23 మంది CMRF లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించే ఎమ్మెల్యే మాట్లాడారు. 20 నెలలో కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి నేడు రేషన్ కార్డులు మంజూరయ్యాయని సన్న బియ్యం పంపిణీ నిరుపేద కుటుంబాలకు వరంగా మారిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో BRS ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే నేడు హామీలను అమలు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు రైతులకు యూరియా కొరత ఎక్కడ లేదని మనకు ఇవ్వాల్సిన యూరియాను ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల ఇబ్బందులతో ఆటలాడుకుంటుందని ఆయన విమర్శించారు.వనపర్తి నియోజకవర్గంలో గతంలో తవ్విన కెనాన్లకు బొక్కలు పెట్టి అభివృద్ధి చేశామని బిల్లులు దండుకున్న నాయకులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఘణపురం మండలంలోని గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వారి డిమాండ్ కు తగ్గట్టుగానే ఎకరాకు 12 లక్షల 60 వేల రూపాయలను చెల్లిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.గతంలో అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమై ఉండేదని నేడు గ్రామ గ్రామాన అభివృద్ధి పనులు ఎంతో వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో ఉండే ప్రతి వ్యక్తిని మీరు గెలిపించాలని ఇతరులు గెలిస్తే అభివృద్ధికి ఆటంకాలుగా మారుతారని ఎమ్మెల్యే అన్నారు.కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు విజయ్ కుమార్, సాయి చరణ్ రెడ్డి క్యామ వెంకటయ్య, వెంకట్రావు, రవి నాయక్, ఆగారం ప్రకాష్ యూత్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, గంజాయి రమేష్ మార్కెట్ యార్డ్ పెద్దమందడి మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి , రమేష్ గౌడ్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు )

