Home వార్తలు తెలంగాణ  చైతన్య రహిత సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సంఘసంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి

 చైతన్య రహిత సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సంఘసంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి

0

 చైతన్య రహిత సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సంఘసంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అణిచివేతలను ఎదిరించిన సాహసి రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరంగా స్వేచ్ఛారహిత, చైతన్య రహితంగా ఉన్న సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సంఘసంస్కర్త సురవరం ప్రతాప రెడ్డి అని వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సంఘసంస్కర్తగా, కవిగా, చిత్రకారుడుగా, రచయితగా, వ్యాసకర్తగా, పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, ఇలా తాను చేపట్టిన ప్రతి రంగంలోనూ తెలంగాణ ప్రజల బాధలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ నిజాం పాలకుల దాష్టికాలపై ముప్పట దాడి చేసిన గొప్ప ప్రజ్ఞశీలి సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన “గోల్కొండ కవుల సంచిక” గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తికి నేటి తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో గొప్ప గౌరవం దక్కిందనీ … పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి నామకరణం చేయడం ఎంతో గొప్ప విషయమని అని వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు గంధం రాజశేఖర్, బంజారా గిరిజన విద్యార్థి సమైక రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంబటి రమేష్, క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నందిపేట తిరుపతయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, అరిఫ్ తదితరులు పాల్గొన్నారు. (Story : చైతన్య రహిత సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప సంఘసంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version