Home వార్తలు తెలంగాణ సుధాకరాచారికి ఆచార్య జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారం

సుధాకరాచారికి ఆచార్య జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారం

0

సుధాకరాచారికి ఆచార్య జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారం

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణానికి చెందిన కవి,పండితులు బస్వోజు సుధాకరాచారికి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారాన్ని వేదాస్ సంస్థ నిర్వాహకులు ప్రదానం చేసారు. తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని వేదాస్ సంస్థ హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో బస్వోజు సుధాకరాచారి ఉపాధ్యాయ రంగంలో, సాహిత్య పరంగా,పద్యానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చేస్తున్న కృషికి గాను *ఆచార్య జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారాన్ని సంస్థ ప్రతినిధులు సిగాజి సంతోష్ కుమార్, నాగాచారి,హైకోర్ట్ విశ్రాంత జడ్జ్ చంద్రకుమార్, కౌలె జగన్నాథం, బిసి జెఎసి అధ్యక్షులు కుందారం గణేశ్ కుమార్ తదితరుల చేతుల మీదుగా ప్రదానం చేసారు. ఈ సందర్భంగా సుధాకరాచారిని పలువురు సాహితీ వేత్తలు, ఉపాధ్యాయులు ,ప్రముఖులు అభినందించారు. (Story:సుధాకరాచారికి ఆచార్య జయశంకర్ సార్ ఉపాధ్యాయ పురస్కారం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version