Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కత్తి పోట్లు పొడుచుకున్న ఇద్దరూ వైకాపా కార్యకర్తలే

కత్తి పోట్లు పొడుచుకున్న ఇద్దరూ వైకాపా కార్యకర్తలే

కత్తి పోట్లు పొడుచుకున్న ఇద్దరూ వైకాపా కార్యకర్తలే

వాళ్లిద్దరూ బొల్లా బ్రహ్మనాయుడు వద్ద పనిచేసిన వారే.

ఇరుకుటుంబాల మధ్య ఘర్షణకు రాజకీయ రంగు..

న్యూస్ తెలుగు / వినుకొండ : తన వద్దే పనిచేసిన ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాల మధ్య ఘర్షణకు రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం మీద నిందలు వేయడం బొల్ల బ్రహ్మనాయుడు దిగజారుడు తనానికి నిదర్శమని వినుకొండ మార్కెట్ యార్డు చైర్మన్ మీసాల మురళీ యాదవ్ ధ్వజం మెత్తారు. టి. అన్నవరం గ్రామంలో కత్తిపోట్లపై వైకాపా, బొల్లా రాజకీయంగా చేస్తున్న విమర్శలను ఘాటుగా ఖండించారు. ఊరిలో పోలేరమ్మ జాతర సందర్భంగా ప్రసాద్ గోపీల మధ్య వివాదం జరిగితే, అది తెలుగుదేశం పార్టీకి ఎలా సంబంధమని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే కత్తిపోట్లుకు దిగిన గోపీ, ప్రసాద్ ఇద్దరూ ఎంతోకాలంగా వైకాపాలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్న విషయం నిజం కాదా అని నిలదీశారు. గోపి తాత రామ యోగియ్య 18 ఏళ్లు బొల్లా పొలం వద్దనే మేనేజర్‌గా పనిచేశారని, అతడిని తొలగించి ప్రసాద్‌ను నియమించుకున్న తర్వాత ఇరువర్గాల మధ్య వివాదం మొదలైం దన్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా చందాలు సేకరించే ప్రసాద్, గోపీ వాళ్ల ఇంటికి వెళ్లిన సమయంలో అది మాటామాట పెరిగిందని, కత్తి పోట్లకు వెళ్లిందన్నది స్థానికంగా అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమని తెలిపారు. గోపీప్రసాద్ ఇద్దరూ వైకాపాలో పనిచేస్తున్న ఫోటోలను కూడా ఆ సందర్భంగా చూపించారు. జగన్ పర్యటన సందర్భంగా ప్రసాద్ ర్యాలీల్లో పాల్గొన్న దృశ్యాలు ప్రదర్శించారు. ఇవన్నీ మరుగున పరిచి బొల్లా బ్రహ్మనాయుడు, వైకాపా పత్రిక సాక్షి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగానే అసలు ఈ గొడవలన్నింటికీ ముఖ్య కారకుడే బొల్లా బ్రహ్మనాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పల్లెల్లో స్వార్థ రాజకీయం కోసం బీసీలు, ఇతర కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని వాపోయారు. గతంలో ఎప్పుడూ వినుకొండలో ఇలాంటి పరిస్థితులు లేవని, బొల్లా వచ్చిన తర్వాతనే కొట్లాటల పరిస్థితి తెచ్చారని అన్నారు. జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా 30 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదని, నూజెండ్ల మండలంలో బొల్లా రాజకీయం మొదలు పెట్టిన ఈ పదేళ్లలోనే దారుణాలన్నీ జరుగు తున్నాయన్నారు. వైకాపా వాళ్లే తన్నుకుని, పొడుచుకుని, చంపుకుని ఇతరులపై నిందలు వే‌స్తుంటే జనాలు చూసి నవ్వుతున్నారన్న మురళీ యాదవ్ అన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, స్థానికంకా చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని తూర్పారబట్టారు. గతంలో రషీద్ హత్య విషయంలో కూడా ఇలానే దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు అప్పుడే తన మనుషులకు సర్దిచెప్పుకుంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవా అని ప్రశ్నించారు. అతడు ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్లలో తెలుగుదేశం పార్టీ వారిని వెంటాడి వేధించి, దాడులు చేసి, కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే జీవీ అంజనేయులు పదేపదే చెబుతుంటారని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో బొల్లా చేసిన అరాచకాల కారణంగానే ప్రజలు 30వేల ఓట్లతో అతడిని ఓడించారని అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కూడా ఇదే బాపతి అన్న మురళీ యాదవ్ అప్పట్లో వై.ఎస్. వివేకా హత్య కేసుని ఇలానే చంద్ర బాబుపై వేయాలని చూశారని ఎద్దేవా చేశారు. వినుకొండలో బొల్లా చేసిన కబ్జాలు, రౌడీయిజంని ఇంకా ఎవరు మరిచిపోలేదన్నారు. దయచేసి ప్రశాంత పల్లెల్లో చిచ్చు పెట్టొద్దని, విద్వేషాలు రేపొద్దని సూచించారు. బొల్లా బ్రహ్మనాయుడు వయస్సు రీత్యా అయినా కాస్తంతా హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కొమ్మ శ్రీను, వీరగంధం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. (Story :కత్తి పోట్లు పొడుచుకున్న ఇద్దరూ వైకాపా కార్యకర్తలే)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!