శని దేవునికి అభిషేకాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణ శివారులో నరసరావుపేట రోడ్డు నందు చెక్క వాగు పక్కన కొలువై ఉన్న మహిమాన్విత శ్రీ జేష్ట లక్ష్మి సమేత శ్రీ శనైశ్చర స్వామి వారి దేవస్థానం నందు శ్రావణ మాస శనివారం – శని అమావాస్య పర్వదినంను పురస్కరించుకొని వేకువ జామున శని దేవునికి 19 రకాల విశేష ద్రవ్య అభిషేకాలు విశేష తైలాభిషేకములు నిర్వహించడం జరిగింది. ఆదిత్యాది నవగ్రహ హోమం లో భాగంగా శని దేవునికి 190 సార్లు ప్రత్యేక హోమ బీజ మంత్ర హవిస్సులు ఇవ్వడం జరిగింది. శని దేవునికి 1008 నామాల సహస్ర నామార్చన తిల అర్చన పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మరియు అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి శివపార్వతి పరమేశ్వర రావు దంపతులు తెలిపారు.(Story : శని దేవునికి అభిషేకాలు )

