Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌100 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్న చీఫ్ విప్ జీవీ దంపతులు

100 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్న చీఫ్ విప్ జీవీ దంపతులు

100 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్న చీఫ్ విప్ జీవీ దంపతులు

వినుకొండ నియోజకవర్గం, cనూజెండ్ల మండలం కమ్మవారిపాలెంలో లబ్దిదారులతో సమావేశం

న్యూస్ తెలుగు/వినుకొండ  : పేదరికం నిర్మూలనలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4లో భాగంగా 100 బంగారుకుటుంబాలను చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దంపతులు దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎంపిక చేసిన 60 కుటంబాల లబ్దిదారులతోనూ శుక్రవారం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ఓకే విప్ జీవీ మాట్లాడుతూ. సెంటు పొలం గానీ, గజం జాగా గానీ ఏమీ లేని నిరుపేద ఎస్టీ కుటుంబాల్లో వెలుగు కోసం ఈ చొరవ తీసుకున్నామన్నారు. పిల్లల ను చదివించుకోవడం, చివరకు వారికి బట్టలు కొనేందుకు కూడా స్థోమత లేని వారిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కమ్మరిపాలెంలో 60 కుటుంబాలు, మిగిలిన వారిని వినుకొండ పట్టణంలో చెంచులు, యానాదులు, ఇతర వర్గాల నిరుపేదల నుంచి ఎంపిక చేస్తామని తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఒక చేయి అందించి పైకి తీసుకుని వచ్చే ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబే తనకు ఆదర్శమన్నారు. కుటుంబాలకు చేయూత, పిల్లలకు చదువులు, ఇళ్లు లేని వారికి ప్రభుత్వ సహకారంలో ఇంటి నిర్మాణం అన్నీ చేపడతామ న్నారు. ముఖ్యమంత్రిచంద్రబాబు పేరుతో కమ్మరివారిపాలెంలో కాలనీ నిర్మించి ఇస్తామన్నారు. పిల్లల్ని సకాలంలో స్కూల్‌కు తీసుకుని వెళ్లేందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఒక ఆటో కూడా అందిస్తామని తెలిపారు. ఆ కుటుంబాలు మొత్తాన్ని ఆర్థిక స్వాతంత్రంతో సంతోషంగా జీవించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. అది సాకారమైన రోజు వ్యక్తిగతంగా తమకు కూడా ఆత్మ సంతృప్తిగా అనిపిస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నామన్నారు. తమలానే ఇలా బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు వచ్చిన వారందరికీ అభినందనలు తెలిపారు. సదాశయంతో అంతా ఇలా కలసికట్టుగా ముందకు సాగితే రాష్ట్రంలో వేగంగా పేదరికం నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు. ప్రభుత్వం, శివశక్తి ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలా వారికి అండగా నిలుస్తామని అన్నారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు సతీమమి, శివశక్తి ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ లీలావతి కమ్మరివారిపాలెం ఎంపిక చేసిన బంగారుకుటుంబాల పరిస్థితులు చూసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి అవకాశం ఇచ్చారని అనిపించిందన్నారు. ఇలాంటి కాలనీలకు వచ్చినప్పుడు అసలైన కష్టాల గురించి వీలు కలుగుతుందన్నారు. పీ-4 ద్వారా వారికి మేలు చేసే అవకాశం రావడం ఎంతో సంతృప్తిని కూడా ఇస్తోందన్నారు. లబ్దిదారుల కుటుంబాలతో మాట్లాడినప్పుడు వారి అవసరాలన్నీ రాసుకున్నామని, రానున్న రోజుల్లో వాటికి తగినవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న వారంతా సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారంతా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, లీలావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : 100 బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్న చీఫ్ విప్ జీవీ దంపతులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!