Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్.కె. రత్న మాణిక్యం కోరారు.2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశానికి నమోదు ప్రక్రియ ప్రారంభమైనదన్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలు గల విద్యార్థినీ,విద్యార్థులు ఆన్ లైన్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు పొందాలన్నారు. ఆన్ లైన్ అడ్మిషన్స్ ప్రక్రియ కళాశాల నందు ఉచితంగా చేస్తున్నామన్నారు. బి.ఎ (ఎకనామిక్స్), బి.ఎ (పొలిటికల్ సైన్స్), బి.కామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.కామ్ (జనరల్ ), బి. ఎస్సీ (కెమిస్ట్రీ), బి.ఎస్సీ(కంప్యూటర్ సైన్స్), బి.ఎస్సీ (మ్యాథమెటిక్స్), బి.ఎస్సీ (జువాలజీ) కోర్సులు కళాశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 26 మధ్య దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 24-28 మధ్య వెబ్ ఆప్షన్స్ కు, వెబ్ ఆప్షన్స్ మార్పుకు ఆగస్టు 29న, సీట్ల కేటాయింపు ఆగస్టు 31న ఉంటాయన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మరిన్ని వివరాలకు 9701506541,994969388 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చునన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!