రైతలకు ఎరువులు సరిపడ సరఫరా చేయాలి
న్యూస్ తెలుగు /సాలూరు : రైతలకు ఎరువులు సరిపడ సరఫరా చేయాలని కోరుతూ సారిక సచివాలయం వద్ద సిపిఎం పార్టీ సాలూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక పంచాయతీ పరిధిలో వచ్చిన ఎరువులను సారిక గంజాయి భద్ర పంచాయతీ పరిధిలో గల గిరిజన రైతులకు ఒకటి, రెండు చొప్పున పంపిణీ చేస్తున్నారని తెలిపారు రోజులు తరబడి సచివాలయాలు చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు యూరియా డి ఏ పి వంటి ఎరువులు సరిపడా అందుబాటులో లేవని అన్నారు ఉన్న అరాకొర ఎరువులు పంపిణీ చేస్తున్నారని అన్నారు గంజాయి భద్ర పంచాయతీ గిరిజన రైతులకు ఎరువులు అవసరం ఉందని అవసరాన్ని మండల స్థాయిలో అధికారులు గుర్తించకపోవడం ఇప్పటికీ కావాల్సిన ఎరువులు కోసం ఇండెంట్ పెట్టకపోవడం సరికాదని తెలిపారు వచ్చిన అరకొర ఎరువులు కొద్దిమంది రైతులకు పంపిణీ చేసి మిగిలిన రైతులను వదిలేసిన పరిస్థితి ఉందని తెలిపారు సాగును బట్టి అవసరాన్ని బట్టి రైతులందరుకు ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు చొరవ చేసి మండలంలో రైతులకు అవసరం మేరకు ఎరువులు తీసుకువచ్చి సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని కోరారు లేనియెడల ఆందోళన పోరాటానికి సిద్ధపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడంగి చరణ్, సన్నం బుచ్చయ్య సిదరపు బాల తదితరులు పాల్గొన్నారు. (Story:రైతలకు ఎరువులు సరిపడ సరఫరా చేయాలి)

