Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా ఎపియూడబ్లూజె ఆవిర్భవ దినోత్సవం

ఘనంగా ఎపియూడబ్లూజె ఆవిర్భవ దినోత్సవం

ఘనంగా ఎపియూడబ్లూజె ఆవిర్భవ దినోత్సవం

– జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం
– విలేకర్ల సమస్యల పరిష్కారానికి కృష
– చింతూరు డివిజన్ అద్యక్షులు ఎం. చంద్ర శేఖర్

న్యూస్ తెలుగు/చింతూరు : ఎపియూడబ్లూజె రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రేవిన్యూ డివిజన్లో కేంద్రంలో ఎపియూడబ్లూజె డివిజన్ కమిటి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 69 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చింతూరు డివిజన్ యునియాన్ అధ్యక్షులు మాసినెని చంద్ర శేఖర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో భాగంగా ముందుగా చింతూరు గాంధీ విగ్రహం వద్ద యునియన్ జెండా ఆవిష్కరణలో భాగంగా గాంధీజి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం యూనియన్ అధ్యక్షులు జెండా ఆవిష్కరించారు.
అనంతరం చింతూరు సెంటర్ నుండి ర్యాలీగా జర్నలిస్టు ల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్ ఎపియూడబ్లూజె వర్ధిల్లాలి అంటూ నినాదాలతో ఐక్యత చాటుకుంటూ చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా ఐటిడిఎ మీటింగ్ హల్ నందు అవిర్భవ దినోత్సవ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ లోని అనారోగ్య కారణాల వలన మృతి చెందిన ఎపియూడబ్లూజె సభ్యులకు రెండు నిమిషాలు పాటు నివాళులు అర్పించారు. అదేవిధంగా చింతూరుకూనవరం వి ఆర్ పురం ఎ ట పక మండలాలకు చెందిన 8 మంది సినియర్ పత్రిక విలేఖర్లకు దుశ్శలవలతో సత్కరించి మెమొంటూలను ప్రశంస పత్రాలను బహుకరించారు.
కార్యక్రమాలు మరియు సమావేశం నకు హాజరైన నాలుగు మండలాల మీడియా మిత్రులకు మెమంటోలను బహుకరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టులతో పాటు జర్నలిస్టు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ ఆవిర్భవ దినోత్సవాన్ని ఉద్దేశించి జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి అభ్యున్నతి ద్యేయంగా ఎపియూడబ్లూజె పనిచేస్తుందని అన్నారు. చింతూరు మన్యంలో కొందరు జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేయడం తో పాటు ఇంకొందరి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు.
ఏజెన్సీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కోసం కృషి చేయడం జరుగుతుందని అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇప్పించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.రాబోయే కాలంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంనకు ఎపియూడబ్లూజె సభ్యులకు పుస్తకాలు పెన్నులు మెమోంటోలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఎపియూడబ్లూజె డివిజన్ రాష్ట్ర కార్యదర్శి పరిటాల వెంకట్, కోశాధికారి టి.రమేష్ విశ్వనాథ్, సంయుక్త కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఎపియూడబ్లూజె సభ్యులు రియజ్, ఫిరోజ్, వి.సతీష్
సీనియర్ పాత్రికేయులు సి హెచ్.విజయ్ కుమార్, ఎం.డి సౌకత్, ఎం. సత్తిబాబు, బి.నాగేశ్వరరావు, కె.బాబురావు, డి.వెంకట రమణ, వి వి ఎస్ టి . శ్రీనివాస్ పి. మోహనరావు, ఎలక్ట్రానిక్ మీడియా రామకృష్ణ , శ్రీనివాస్, నవీన్, వినయ్ ప్రసాద్, జీవన్ నాలుగు మండలాల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. (Story:ఘనంగా ఎపియూడబ్లూజె ఆవిర్భవ దినోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!