గీతాంజలి లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా స్కూల్ ప్రిన్సిపాల్ మతి కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణవేణి మాట్లాడుతూ. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందంగా ,చిరునవ్వు తో, అందరికి ఆనందాన్ని పంచే శ్రీకృష్ణుడు వెనక ఎన్ని కష్టాలు శ్రీకృష్ణుని జీవితం… దారుణమైన ముళ్ళబాట సుఖంగా, హాయిగా ఉన్నట్టు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు కృష్ణుడు. కృష్ణుడు
కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యా ప్రయత్నం చేసింది పూతన.
అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.
కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా!
జరాసంధునితో వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ కృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. ఎవరు ఎన్ని నిందలు వేసిన ధర్మ రక్షణ కొరకే తన జీవితాన్ని కొనసాగించాడు. తన జీవితాన్ని తామరాకుపై నీటిబొట్టులాగా గడిపినాడు. ధర్మరక్షణ కొరకు తాను చేస్తున్న పని చిన్నదా పెద్దదా అని చూడలేదు. ఆవేశం కాదు ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణుని జీవితం నుంచి నేర్చుకోవాలి. నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే కాని, ఆచరించడం కష్టం* *కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే అనుభవించడం కష్టం. కృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడు అయ్యాడు.
అందరికి జగద్గురువు అయ్యాడు. విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమం అందర్నీ అలరించింది. (Story:గీతాంజలి లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు)

