Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడాలి

బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడాలి

బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడాలి

న్యూ స్ తెలుగు/వినుకొండ :దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బూర్జువా పార్టీలు అధికారంలో ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ బుజస్కందాలపై ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలు 7వ తేదీ ప్రారంభం కాగా, 8 తేదీ స్థానిక గంగినేని కళ్యాణమండపంలో జిల్లా ప్రతినిధుల సభ జరిగింది. సభకు మందపాటి రమణారెడ్డి, బూదాల శ్రీనివాసరావు, నాగమణి, ఎం. రమేష్ అధ్యక్షత వర్గంగా వ్యవహరించగా, పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ.మారుతి వరప్రసాద్ వక్తలను వేదిక పైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ ప్రసంగిస్తూ. మహాసభల సందర్భంగా 7వ తేదీ నిర్వహించిన భారీ ప్రదర్శన, బహిరంగ సభ విజయవంతమైందని ఈ సందర్భంగా స్థానిక సిపిఐ నేతలను జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి వచ్చిన సిపిఐ ఏరియా కార్యదర్శులను, నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఒకనాడు పల్నాడు జిల్లా కక్షలకు, పంతాలకు నిలయంగా ఉండేదని. నేడు పరిస్థితులు మారి అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నదని, ఈ సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో కీలకంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆనాడు సిపిఐ ఉద్యమాల ఫలితంగా. జమిందారి వ్యవస్థ పోయి, దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో ఎంతోమంది పేదలకు భూములు దక్కాయని అన్నారు. అలాగే బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాలు రద్దు పలు అంశాలపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పై భారత కమ్యూనిస్టు పార్టీ ఒత్తిడి తీసుకురాగా, అప్పుడు పార్లమెంటులో సరిపడా మద్దతు లేని కారణంగా కమ్యూనిస్టుల సహకారం మద్దతుతో ఆ బిల్లు పాస్ అయిందని ముప్పాళ్ళ గుర్తు చేశారు. అలాగే భూ సంస్కరణల చట్టం ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితమే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని ఉండాలని నాడు ఉద్యమాలు చేసింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. అయితే నేడు కేంద్రంలో అమిత్ షా తదితర ఎన్డీఏ నేతలు జాతి ద్రోహులను దగ్గరకు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ మరింత బలపడేందుకు యువత చేరువకు వెళ్లాలని, ప్రస్తుత పరిస్థితులను వారికి వివరిస్తూ వారిని ఆకర్షించే విధంగా సిపిఐ ముందుకు సాగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జల్లి. విల్సన్ మాట్లాడుతూ. కేంద్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంపై వారికి ఎటువంటి గౌరవం లేదని అన్నారు. మైనార్టీ సీట్లతో గెలిచిన మోడీ తొలుత జగన్మోహన్ రెడ్డిని, అనంతరం చంద్రబాబు నాయుడు ని ఆశ్రయించాడని జల్లి విల్సన్ విమర్శించారు. లౌకిక రాజ్యం కాపాడుకునేందుకు ఎన్డీఏ పై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మోడీ పాలన న్యాయ వ్యవస్థను కూడ ఇరుకున పెడుతుందన్నారు. ముస్లింల ఆస్తులు కొల్లగొట్టేందుకు మోడీ కుట్ర పడుతున్నాడని, కూటమి ప్రభుత్వంపై కూడా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది అన్నారు. ఆనాడు సిపిఐ పోరాట ఫలితంగా భూ పోరాటాల ద్వారా పేదలు భూములు దక్కించుకోవడం జరిగిందని, సిపిఐ ఒత్తిడి కారణంగానే ఆనాడు జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం చేయడం జరిగిందన్నారు. అయితే నేడు నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ. ఇప్పటివరకు అనేక ప్రధాన మంత్రులను చూసాం, ఇటువంటి అబద్ధాల మోడీని ఎప్పుడు చూడలేదన్నారు. ఒక వాగ్దానం కూడా నెరవేర్చకుండా అంబానీ, అదానికి ఊడిగం చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు తాను గెలిస్తే 100 రోజుల్లో నిత్యవసర సరుకులు ధరలు తగ్గిస్తానని చెప్పి గద్దెనెక్కిన మోడీ లీటర్ పెట్రోల్ 45 ఉండగా 110 కి పెంచాడని, గ్యాస్ 470 ఉండగా నేడు 970కు చేరిందని, ఆనాడు మోడీ, అమిత్ షా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసింది ఇందుకేనా అని జంగాల అన్నారు. వీటన్నింటిపై పోరాటం చేసే వారిని జాతి వ్యతిరేకులు అని ఎన్డీఏ నేతలు కారు కూతలు కూస్తున్నారన్నారు. నేడు ప్రధాని మోడీ, కాదని, బడా కంపెనీలు రాజ్యమేలుతున్నాయన్నారు. సి ఆర్ ఫౌండేషన్. కోఆర్డినేటర్ వయ్యకంటి చెన్నకేశవరావు మాట్లాడుతూ. తన తండ్రి వయ్యకంటి శివప్రసాద్, కుటుంబ సభ్యులు తుది వరకు పార్టీ కోసం కృషి చేశారని, తన తండ్రిని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోకుండా వర్దంతులు నిర్వహించడం కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా తుది వరకు భారత కమ్యూనిస్టు పార్టీ కోసం కృషి చేస్తానని అన్నారు…………… అలాగే సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతి వరప్రసాద్ ఈ మూడేళ్ల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై, రైతాంగ సమస్యలపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్వహించిన ఆందోళనలు, ధర్నాలు, పలు కార్యక్రమాలు పై కార్యదర్శి నివేదికను సభలో చదివారు. ఈ మూడేళ్లలో 900 రోజుల్లో 900 కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు, రైతులకు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామన్నారు. అలాగే తొలుతగా ప్రజ నాట్యమండలి జిల్లా కార్యదర్శి బైరా పట్నం రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలపించిన విప్లవ గేయాలు అలరించాయి. అలాగే వయకంటి శివప్రసాద్ సభ వేదిక ఆవరణలో పార్టీ జెండాను సిపిఐ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా ఆవిష్కరించగా, మృతవీరుల స్మారక స్థూపం వద్ద సిపిఐ సీనియర్ వృద్ధ నాయకులు షేక్ బుడే పూలు చల్లి జోహార్లు అర్పించారు. ఇంకా ఈ సభలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, జిల్లా ఏరియా కార్యదర్శులు బూదాల శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావు, ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఎం. రమణారెడ్డి, టి. బాబురావు, చక్రవరం సత్యనారాయణ రాజు, ఎం. శ్రీనివాసరావు, ఎం.రమేష్, గుంటూరు జిల్లా సిపిఐ నాయకులు కోట మాల్యాద్రి, అంగన్వాడి బాధ్యులు సారమ్మ,అరసం రాష్ట్ర కార్యదర్శి కె.శరత్ చంద్ర శ్రీ, పాల్గొనగా జిల్లా వ్యాప్తంగా 300 మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శావల్యాపురం సిపిఐ కుటుంబ సభ్యుల్లో కృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వయ్యకంటి చెన్నకేశవలను దుశ్యాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.(Story : బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాడాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments