ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి నిరూపించిన అఖిలపక్ష ఐక్యవేదిక
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో మేనేజర్ ఐదుగురు కొత్త సిబ్బందిపై వేటు? ఇది సబవేనా ? అసలైన అవినీతిపరులను విడిచిపెట్టి పై ఆఫీసర్లను విడిచిపెట్టి కిందిస్థాయి సిబ్బందిని బలి చేయడం కరెక్టా అని ఐక్యవేదిక ప్రశ్నించారు.మొత్తం పైన ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగింది వాస్తవమేనని ఒప్పుకున్నట్లేగా? జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీలో మేనేజర్ , వార్డ్ ఆఫీసర్ లను సస్పెన్షన్ చేయడం అధికారులకు ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో మరియు లాలూచీతో ఇందిరమ్మ ఇల్లు అక్రమాలు చేయడాన్నీ అఖిలపక్ష ఐక్యవేదిక బయటపెట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఇప్పుడు కొందరు సస్పెండ్ అయ్యారు. దీనివలన అధికారులందరూ తమ తమ విధులు సక్రమంగా నిర్వహించి రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పక్కన పెట్టాలని, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకు సేవ చేస్తే ఎలాంటి ఒడిదుడుకులు ఉండవని అఖిలపక్ష ఐక్యవేదిక సూచిస్తుంది. రాజకీయ నాయకుల సొంత స్వలాభం కోసం అధికారులు బలి ఇవ్వడం మామూలే కొందరు భయపడి కొందరు డబ్బులకు లాలూచీపడి తమ తమ జీవితాలను పణంగా పెట్టడం సరికాదని అందుకే ఇక ముందు ఎవ్వరూ తమ తమ విధుల్లో అలసత్వం ఉండకూడదని అఖిలపక్ష ఐక్యవేదిక సూచిస్తుంది. ఇదంతా కిందిస్థాయి నాయకుల వల్లనే జరిగిందని కొందరు అధికారులు గగ్గోలు పెడుతున్నారనీ ముకుల పక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు గౌనికాడి యాదయ్య, కొత్త గొల్ల శంకర్, బొడ్డుపల్లి సతీష్, రామస్వామి, గంధం భరత్, కురుమూర్తి, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నా.(Story : ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి నిరూపించిన అఖిలపక్ష ఐక్యవేదిక )

