అయోధ్య చారి మృతికి సిపిఐ డివిజన్ నాయకులు సంతాపం
తెలుగున్యూస్/ చింతూరు : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిపిఐ నాయకులు బొల్లోజు అయోధ్య చారి కు చింతూరు డివిజన్, మండల నాయకులు ప్రకటనలో సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు జడ్పిటిసి గా గెలిచి తరువాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అలాగే సిపిఐ పార్టీ కరుడుగట్టిన కమ్యూనిస్టు యోధుడిగా సిపిఐ పార్టీలో కడవరకు ఉండి బూర్గంపాడు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తూ ఇద్దరూ ఎమ్మెల్యేలను గెలిపించి ఆయనకంటూ సిపిఐ పార్టీలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయన నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలలో ఆయనకి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బుధవారం అకస్మాత్తుగా హైదరాబాద్ యాక్సిడెంట్లో బొల్లోజు అయోధ్య మరణించారు.ఆయన మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గుజ్జ మోహన్ రావు,, చింతూరు డివిజన్ సహాయ కార్యదర్శి రంజాన్, చింతూరు మండల కన్వీనర్ తుర్రం మురళి, వారణాసి సాంబశివరావు, వెట్టి భద్రయ్య, తుర్రం చంద్రయ్య, ఎస్ వెంకట రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story:అయోధ్య చారి మృతికి సిపిఐ డివిజన్ నాయకులు సంతాపం)
