రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు వితరణ
న్యూస్ తెలుగు / వినుకొండ : తల్లి పాల వారోత్సవాలలో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణం లోని ఏబీఎన్ కాంపౌండ్ , కొత్తపేట మరియు పెదనాలసా బజార్ అంగన్వాడీ కేంద్రాల పరిధి లోని తల్లులకు శుక్రవారం సాయంత్రం తల్లి పాల ప్రాధాన్యత పట్ల అవగాహనా కార్యక్రమం నిర్వహించి పోషకాహార బ్రెడ్ లు అందజేయటం జరిగింది . అలాగే ఈ మూడు అంగన్వాడీ కేంద్రాల అవసరాల దృష్ట్యా ఆ కేంద్రాలకు క్లబ్ మాజీ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత రెడ్డి 45 స్టీల్ ప్లేట్లు మరియు 45 స్టీల్ గ్లాసులు తో పాటు మూడు మినరల్ వాటర్ కేన్ లను స్వయంగా వచ్చి అందజేయగా, మరో రోటరీ సభ్యుడు దావులూరి శ్రీనివాసరావు కూడా హాజరై మూడు సీలింగ్ ఫ్యాన్ లు అందజేశారు . ఈ కార్యక్రమం గురించి రోటరీ అధ్యక్షులు యేరువ వెంకట నారాయణ మాట్లాడుతూ. అవసరాల ఆధారంగా మరిన్ని అంగన్వాడీ కేంద్రాలకు కూడా సహాయ పడేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ సదా సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పొత్తూరి నవీన్ , రోటరీ జిల్లా 3150 ముఖ్యుడు చిరుమామిళ్ల కోటేశ్వరరావు , క్లబ్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మస్తాన్ రోటరీ సభ్యులు నాగేంద్రుడు మాష్టారు , గుమ్మా అంజిరెడ్డి , గాలి చిన కోటేశ్వరరావు , సీడీపీఓ ఇంచార్జి శివ నాగలక్ష్మి , అంగన్వాడీ టీచర్లు , అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. (Story:రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు వితరణ)
