72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేద్దాం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ విజయేంద్ర సాగర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా బహుజన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల వాగ్దానంలో కామారెడ్డి డిక్లరేషన్లు వాగ్దానం చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు అయిన కాలయాపన చేస్తూ బిసి డిక్లరేషన్ ప్రకటించకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఎన్నికల్లో ప్రకటించిన హామీని వెంటనే అమలు పరచాలని బహుజన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తూ బీసీ సమాజాన్ని చైతన్యపరిచారు 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంగా రైల్ రోకో నిర్వహిస్తామని ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించి 42 శాతం రిజర్వేషన్ ఆమోదం పొందడం జరిగింది ఈ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపడం గవర్నర్ గారు న్యాయ సలహాలు తీసుకుంటామని బీసీ ఆర్డినెన్స్ పతులను రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం తో వెంటనే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద 72 గంటల నిరాహార దీక్ష తేదీ 4 5 6 7 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని ఈ నిరాహార దీక్షను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు వనపర్తి జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని దీక్షకు సంఘీభావం ప్రకటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకురాలు కే అనిషా శ్రీనివాసులు సాగర్ తెలంగాణ జాగృతి నాయకులు సయ్యద్ కలాం పాషా వెంకటేష్ విజయ్ ముదిరాజ్ సర్దార్ బేగ్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు. (Story:72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేద్దాం)
