కూటమి ప్రభుత్వం
ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నది
న్యూస్ తెలుగు / వినుకొండ : ఎన్నికల వాగ్దానాలు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నదని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. చీప్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అతి సన్నిహితంగా ఉంటున్న కారణంగానే వినుకొండ నియోజకవర్గం లో పలు సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు వస్తున్నాయన్నారు. అలాగే కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సొసైటీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. బ్యాంకు అధికారులు నియోజకవర్గంలోని సొసైటీ అధ్యక్షులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అన్ని రుణాలు అందె విధంగా కృషి చేయాలని, సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని మక్కెన కోరారు. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్నదని. రైతులకు వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, అందుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేసేందుకు అధికారులు సొసైటీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. (Story:కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నది)
