ప్రసిద్ధ కవి కరీముల్లాకు మాచర్ల లో ఘన సత్కారం
న్యూస్ తెలుగు / వినుకొండ : మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రసిద్ధ కవి కరీముల్లాకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో కవి బెజ్జంకి జగన్నాధాచార్యులు ప్రసంగిస్తూ ఆధునిక తెలుగు కవిత్వంలో కరీముల్లా రాసిన పుస్తకాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. కరీముల్లా కలం పేదల కోసం, పీడితుల కోసం గళమెత్తుతుందని కొనియాడారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్మన్ మదార్ సాహెబ్ మాట్లాడుత. కరీముల్లా వినుకొండ మహాకవి గుర్రం జాషువా వారసత్వాన్ని నిలబెట్టిన గొప్ప కవి అని చెప్పారు. డిప్యూటి రిటైర్డ్ డియివో రామకృష్ణ మాట్లాడుత. పీడిత ప్రజల కోసం, ప్రగతిశీల భావాలతో కరీముల్లా కవిత్వం కదం తొక్కటం మనం చూస్తున్నాం అని కరీముల్లా కవిత్వాన్ని విశ్లేషించారు. గవర్నమెంట్ డాక్టర్ ద్రాక్షాయణి ప్రసంగిస్తూ కరీముల్లా వంటి కవుల వల్లనే సమాజంలో చైతన్యం వస్తుందని అన్నారు.అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షుడు పాషావలి పల్నాడు ప్రాంతానికి కరీముల్లా వన్నె తెచ్చిన కవి అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ ఆదినారాయణ,జైభీం అధ్యక్షుడు జార్జి, తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రసిద్ధ కవి కరీముల్లాకు మాచర్ల లో ఘన సత్కారం)

