కాలువపై ఉన్న కరెంటు స్తంభాన్ని పరిశీలించిన ఏఈ, రైతులు, పిడిఎం నాయకులు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలోని విఠంరాజుపల్లి, బ్రాహ్మణపల్లి ఎన్ఎస్పీ కాలువపై 33 కె.వి. లైన్ స్తంభం ఎస్పీ కాలవపై ఉండటం తీగలు రాకపోకలకు ఆటంకం గా ఉండటం, స్తంభం బలహీనంగా ఉండటం తో ఇటీవల గ్రీవెన్ సెల్లులో జిల్లా కలెక్టర్ కి అర్జీ ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో శనివారం వినుకొండ ఉదయం 11 గంటలకు ఎలక్ట్రికల్ రూరల్ ఏఈ శ్రీనివాసరావు, లైన్మెను, ఆ ప్రాంత రైతులతో పిడీఎం నాయకులు వై వెంకటేశ్వరరావు కరెంటు స్తంభాన్ని, తీగలను పరిశీలించారు. రూరల్ ఏఈ మాట్లాడుతూ. ఈ విషయాన్ని ఏడిఎ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు. (Story:కాలువపై ఉన్న కరెంటు స్తంభాన్ని పరిశీలించిన ఏఈ, రైతులు, పిడిఎం నాయకులు)

