భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా కు ఘన నివాళులు
న్యూస్ తెలుగు / వినుకొండ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ పిలుపు మేరకు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ ఆదేశాలు మేరకు పద్మశ్రీ గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ. గుర్రం జాషువా ఒక దళితుడిగా పుట్టి ఎన్నో కుల వివక్షను ఎదుర్కొన్నారని, తన కవిత్వాలు ద్వారా సమాజంలో వివక్ష తొలగించేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు గొడవర్తి సుజాత, జిల్లా సెక్రెటరీ కవలకుంట జాన్ బాబు, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్, నియోజకవర్గ కో కన్వీనర్ అప్పారావు, నారిశెట్టి మహేష్, మూర్తియ్య, యేండ్లురి వీరయ్య, గర్రె అనిల్, అప్పల రాజా, తదితరులు పాల్గొన్నారు. (Story:భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా కు ఘన నివాళులు)
