జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో గుర్రం జాషువాకు ఘన నివాళులు
న్యూస్ తెలుగు /వినుకొండ : కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 54వ వర్ధంతి సందర్భంగా వినుకొండ మున్సిపల్ ఆఫీస్ వద్ద జాషువా కాశ్య విగ్రహానికి జాషువా సాంస్కృతిక సమైక్య తరపున ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా సమైక్య అధ్యక్షులు చిలకల జానసుందర్రావు మాట్లాడుతూ. సమాజంలోని రుగ్మతలు మరియు అసమాన తలపై జాషువా తమ కాలం ద్వారా హైందవ సమాజ అట్టడుగు వర్గాలను చైతన్యం పరిచే విధంగా తాను దాదాపు 36 కావ్యాలను రచించారని చెప్పారు. అటువంటి వ్యక్తి మన వినుకొండ లో పుట్టడం మన అందరి అదృష్టంగా భావించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రెడ్డి బోయిన ప్రసన్న, కోశాధికారి భాగవతల రవికుమార్, పిడుగు విజయ్, కే దేవ, మాచర్ల మోహన్ రావు, ఆర్టీసీ జి కమలారం, చిలకల శ్యామ్ లింకన్, తదితరులు పాల్గొన్నారు. (Story:జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో గుర్రం జాషువాకు ఘన నివాళులు)
