స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్
జాతీయ స్థాయిలో 301వ ర్యాంక్ సాధించిన వినుకొండ పురపాలక సంఘం
న్యూస్ తెలుగు/వినుకొండ : జాతీయ స్థాయిలో పురపాలక సంఘాలకు నిర్వహించే స్వచ్ఛతా ర్యాంకింగ్స్ లో స్వచ్ఛ సర్వేక్షన్ 2024 ర్యాంకింగ్లో వినుకొండ పురపాలక సంఘం రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకును మరియు జాతీయస్థాయిలో 301వ ర్యాంకును సాధించడమే కాక ఓడిఎఫ్ ++ గుర్తింపుని వినుకొండ పురపాలక సంఘం సాధించిందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.nఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాలు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ డా..దస్తగిరి సూచనలతో పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రతిఫలంగా, పురపాలక సంఘం స్వచ్ఛతా ప్రమాణాలను అమలు చేయడం వల్ల స్వచ్ఛ సర్వేక్షణ 2024 ర్యాంకుల్లో రాష్ట్ర స్థాయిలో మెరుగైన 9వ ర్యాంకును కైవసం చేసుకోగా జాతీయస్థాయి లో 301 వ ర్యాంకును సాధించడం అభినందనీయమని తెలిపారు. గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ 2023 ర్యాంకింగ్స్ లో రాష్ట్రస్థాయిలో 43 ర్యాంకుతో జాతీయ స్థాయిలో 1977 ర్యాంకుతో పురపాలక సంఘం సరిపెట్టుకున్నది. ఈ సందర్భంగా మెరుగైన సేవలు అందించిన పురపాలక సంఘం మునిసిపల్ పబ్లిక్ హెల్త్ , ఇంజనీరింగ్ ,ప్లానింగ్ సిబ్బందికి కమిషనర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదేవిధంగా మునిసిపల్ సిబ్బంది తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో వినుకొండ పట్టణ పురోభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయాలని తెలిపారు.(Story : స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ )

