Homeవార్తలుతెలంగాణయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం  ప్రారంభం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం  ప్రారంభం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం  ప్రారంభం

న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు నైపుణ్యాలు అందించేందుకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సమీపంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి శాసన సభ్యులు మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ గ్రామీణ యువతకు నైపుణ్యాలు అందించేందుకు రూరల్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ సంస్థల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. స్వయం ఉపాధి కోసం వచ్చేవారికి వేగంగా శిక్షణ కల్పించి ఉపాధి మార్గం చూపించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో యువతకు నైపుణ్యవంతమైన శిక్షణలు అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు.ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి వారికి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. వనపర్తి లోని మొట్టమొదటి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం నెలకొలుపుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సహకారంతోనే ఇంత వేగంగా ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, డి ఆర్ డి ఓ ఉమాదేవి, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం భాస్కరరావు, రీజనల్ హెడ్ సత్యనారాయణ, ఎల్డి ఎం శివకుమార్, సాయి ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, శిక్షణ సంస్థ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story:యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రం  ప్రారంభం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!