అశోక్ గజపతి రాజుకి అభినందనలు తెలిపిన జనసేన నాయకులు
న్యూస్‌తెలుగు/విజయనగరం : గోవా గవర్నర్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి , తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అభినందనలు తెలిపారు. గురువారం అశోక్ గజపతి రాజు నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు అవనాపు విక్రమ్ సాలువా కప్పి అభినందనలు తెలిపారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు నియామకం విజయనగరం జిల్లాకే గర్వకారణం అని ఈ సందర్భంగా జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి ని కలిశారు.ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కాళ్ల గౌరీ శంకర్ , సతీమణి కాళ్ళ రూప, తనయుడు కాళ్ళ గౌతమ్, జనసేన విజయనగరం నియోజకవర్గం నాయకులు సంపత్ రాజు, మండల లోకేష్, షేక్ మారేష్, ముని లక్ష్మణ, మద్దిల నారాయణరావు, కంటుభుక్త సతీష్, ఇజ్జాడ సాయి, బుగత పోతన్న, ఖాదర్, సోమాదుల తారాకేష్, దుప్పాడ నరేష్, అలుగోలు శ్రీను, సురేష్, అనీల్, జగదీష్, వీర మహిళలు రాయన సత్యవతి, దుప్పాడ జ్యోతి, పీతల వరలక్ష్మి, కెల్ల కవితా రాణి, సోమాధుల ఆదిలక్ష్మి మరియు జనసైనికులు పాల్గొన్నారు. (Story:అశోక్ గజపతి రాజుకి అభినందనలు తెలిపిన జనసేన నాయకులు )

