ఎరువులు, పురుగు మందుల షాప్ లు తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు ఆదేశాల మేరకు బుధవారం అంతర జిల్లా కమిటీలుగా ఏర్పాటైన అధికారులు ఏలూరు జిల్లా కోట రామ చంద్రపురం, సహాయ వ్యవసాయ సహాయకులు పి జి బుజ్జి బాబు, విజయవాడ రీజినల్ విజిలెన్స్ విభాగం ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహమ్మద్ ఉమర్ , సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి సుబ్బారెడ్డి సత్తెనపల్లి, వినుకొండ మండల వ్యవసాయ అధికారి జీ వరలక్ష్మి లు బుధవారం వినుకొండ పరిధిలోని విత్తనాలు, ఎరువులు ,పురుగుమందులు షాపులను తనిఖీ చేయుట జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఎరువుల పురుగుమందుల లైసెన్సులను స్టాక్ రిజిస్టర్లు ఇన్వాయిస్లు తనిఖీ చేయుట జరిగింది. ప్రతి డీలరు తప్పనిసరిగా స్టాక్ బోర్డు నిర్వహించాలని ,స్టాక్ వివరములను స్టాక్ రిజిస్టర్ లో ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలని, రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలనని, ఎమ్మార్పీలకు మించి విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్ లో నిల్వలు గోదాముల్లోలో నిల్వలు పరిశీలించడం జరిగింది. (Story:ఎరువులు, పురుగు మందుల షాప్ లు తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు)

