సుడిగాలి పర్యటన చేసిన ఐటిడిఏ పి ఒ అపూర్వ భరత్

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు డివిజన్ లో ఐటిడిఏ పిఓ అపూర్వ భరత్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. గోదావరి వరద పెరుగుతున్న సందర్భంగా కూనవరం, వి ఆర్ పురం మండలంలోని వివిధ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సందర్శించడం జరిగినది. మొదట ఐ టీ డి ఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ కుటూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి అక్కడ ప్రస్తుతం ఉన్న మందులు వరుస క్రమంలో స్వయంగా చెక్ చేయటం జరిగినది. అదేవిధంగా ఈ సంవత్సరం గోదావరి శబరి వరదలుకు డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉంచాలని డిప్యూటీ పుల్లయ్య ను ఆదేశించారు. రేగులపాడు, అభిచర్ల, లింగాపురం, కూటూరు, పేదర్కూరు, చినర్కూరు, కొండరాజు పేట పంచాయితీల జనాభాకు వరద సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అదే విధంగా కుటూరు పీహెచ్సీ కు జెనరేటర్ ను త్వరలో ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పారు. కుటూరు పీహెచ్సీ ఇంటెర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా అత్యవసర సమయంలో సమాచారం చేరవేయడానికి ఉపయోగపడుతుందని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ వారు పేర్కొన్నారు. పీహెచ్సీ పరిసరాలను గమనించిన ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు ఆసుపత్రి ఆవరణంలో పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని సదరు విలేజ్ రెవెన్యూ అధికారి వారిని ఆదేశించడం జరిగినది. కుటూరు గ్రామంలో ఉన్న జి సి సి గోడౌన్ లో ముందస్తుగా బియ్యం స్టాక్ ఉంచి 5 పంచాయతీలకు వరద సమయంలో పంపిణీ చేయటం కోసం ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల వారిని ఆదేశించడం అయినది. తదుపరి చినర్కూరు గ్రామం నందు ఉన్న ఒపెన్ ఏరియాలో ఉన్న ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ను సందర్శించడం జరిగినది అక్కడ ప్రజా ప్రతినిధులు తో మాట్లాడుతూ అడిగిన అదనపు బోర్స్, సోలార్ లైట్లు, బియ్యం అడ్వాన్స్ స్టాక్, రోడ్లు వంటి వాటి గురించి చర్చించడం జరిగినది. తరువాత వెలుగు గోడౌన్ కోతులగుట్ట లో సందర్శించి అడ్వాన్స్ స్టాక్ పెట్టాలని పౌర సరఫరాల వారిని ఆదేశించడం జరిగినది. కోతులగుట్ట నందు ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ సందర్శించి ఫ్లడ్ సమయంలో కావలసిన సదుపాయాలు గురించి ఆసుపత్రి సూపరిండెంట్ వారిని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్స్ కొరత ఉన్నదని సూపరిండెంట్ చెప్పగా అడ్డతీగల,చింతూరు నుండి ఇద్దరు డాక్టర్లు ను నియమించడం జరుగుతుందని చెప్పారు.పైడి గూడెం నందు రిజర్వ్ ఫారెస్ట్ ఒపెన్ ఫీల్డ్ ఏరియా లో ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ పరిశీలించడం జరిగినది. ఈ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ నందు ఒక 800 నుండి 1000 కుటుంబాలు నివాసం ఉండవచ్చని, ఇక్కడ ఒకటి లేదా రెండు హ్యాండ్ బోర్స్ అవసరం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్,చెప్పినారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల అనుమతితో బోర్స్ ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పారు.
తహసీల్దార్, కూనవరం మండలం కార్యాలయంలో కంట్రీ బోట్స్ ఓనర్స్ తో ప్రాజెక్టు అధికారి సమావేశం అయి వారు వరద సమయంలో సమర్ధవంతంగా పని చేయటానికి వారికి కావలిసిన సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వి ఆర్ పురం మండలంలోని రేఖపల్లి పీహెచ్సీ ను సందర్శించి స్టాకు తనిఖీ చేయటం జరిగినది. రేఖపల్లి లో ఏర్పాటు చేసుకున్న ఫ్లడ్ రిలీఫ్ సెంటర్స్ ను పరిశీలించి త్వరలో బరకాలు ఇవ్వడం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి తెలిపారు. అక్కడే ఉన్న గోడౌన్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా GI షీట్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తదుపరి అన్నవరం బ్రిడ్జి నందు ఈ సంవత్సరం బ్రిడ్జి కి ఇరు వైపుల రాడ్స్ తో పెద్ద పెద్ద రోప్స్ ఏర్పాటు చేస్తామని ఇది ఏర్పాటు చేయటం వలన వర్షపు నీరు బ్రిడ్జి మీద పారుతున్నపుడు జనం బ్రిడ్జి దాటటానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద మట్టపల్లి గ్రామం లో ఉన్న వైద్య ఉప కేంద్రం లో వరద ల సమయంలో తగినంత మందులు, ఒక డాక్టర్ ను ఉంచాలని డిప్యూటీ పుల్లయ్య ను ఆదేశించారు. ఈ ఉపకేంద్రంకు ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ ఒక ఫ్రిడ్జ్ ను మంజూరు చేసినారు. ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు కన్నాయిగూడం టూ చింతరేగుల పల్లి, తుస్టివారిగూడెం టు ఎ వి గూడెం రోడ్ బ్లాక్ పాయింట్స్ స్వయంగా చూసి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని పెట్టించడం జరిగినది. ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు మాట్లాడుతూ వరద కు సంబంధించిన సమాచారం ఈ సంవత్సరం నుండి మీడియా ఇతర వాట్సప్ గ్రూపు లో అందించడం జరుగుతుందని చెప్పినారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, రంపచోడవరం, బాల కృష్ణ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు, ఏటపక, మురళి, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్, చింతూరు, శ్రీనివాస్ తహశీల్దార్, కూనవరం, సరస్వతి , తహసిల్దార్, వి ఆర్ పురం , జగన్నాథం ఎంపీడీవో, కూనవరం, ఇమ్మాన్యూలు , ఎంపీడీవో, వి ఆర్ పురం సిబ్బంది పాల్గొన్నారు. (Story:సుడిగాలి పర్యటన చేసిన ఐటిడిఏ పి ఒ అపూర్వ భరత్)

