Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజలను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం

ప్రజలను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం

ప్రజలను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం

న్యూస్ తెలుగు/ సాలూరు : కూటమి ప్రభుత్వం లో ఉన్న నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పిడిక రాజన్న దొర అన్నారు బుధవారం మొదటి రోజు సాలూరు నియోజక వర్గం, సాలూరు మున్సిపాలిటీ పరిధిలో గల రామ కాలనీ లో బాబు స్యూరిటీ – మోసం గ్యారంటీ అనే నినాదంతో గడప గడప కు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట ఈ కార్యక్రమం సజావుగా జరగాలని స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటమీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పాంప్లెట్ ఇస్తూ వారు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. సూపర్ సిక్స్ పథకాలు మొదటి సంవత్సరం ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. గత వైయస్సార్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వం అబద్దాలను గ్రహించుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఓటునే ఆయుధంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు, కౌన్సిలర్లు గొర్లు జగన్మోహన్ రావు, వైసీపీ నాయకులు మేకల శంకర్రావు, జె శ్రీను, పున్నాన మోహన్ రావు, గిరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రజలను మోసం చేస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!