ఘనంగా గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, సినీ నటులు, కీర్తిశేషులు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను గుమ్మడి కళా పీఠం కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమ్మడి కళా పీఠం ప్రధాన కార్యదర్శి దేవరపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహామంత్రి తిమ్మరుసు, భూమికోసం, పండంటి కాపురం వంటి అనేక చిత్రాలలో తన నటనతో తెలుగు వెండితెర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మహానటుడని కొనియాడారు. గుమ్మడి జయంతి సందర్భంగా గుమ్మడి కళాపీఠంలోని సభ్యులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 3 వేల రూపాయలు మరియు పోస్టల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు చేయించేందుకు గుమ్మడి కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు ముందుకు వచ్చినందుకు వారిని పలువురు సీనియర్ ,వర్ధమాన కళాకారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కళాకారులు పాల్గొన్నారు. (Story:ఘనంగా గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు )

